: రోమియో పేరును దుర్వినియోగం చేయద్దు: యాంటి రోమియా స్క్వాడ్స్ పై రాంగోపాల్ వర్మ
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు యాంటి రోమియా స్క్వాడ్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ పోలీసుల బృందాలకు యాంటి రోమియా స్క్వాడ్స్ అనే పేరు పెట్టడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ విచిత్రంగా స్పందించాడు. రోమియో అనే పేరు ప్రేమకు నిర్వచనంగా ఉంటుందని, ఆ స్క్వాడ్‌కి ఆ పేరు పెట్టడమేంటని ప్రశ్నించాడు. రోమియోను ఈవ్ టీజర్ గా ఎలా ముద్ర వేస్తారని అన్నాడు. యూపీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన యాంటి రోమియా స్క్వాడ్స్ ను ఇటాలియన్లు తమ దేశంలో యాంటి దేవదాసు స్క్వాడ్స్ గా పిలుస్తారని అన్నాడు. రోమియో పేరును దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నాడు. ఈ పోలీసు టీమ్‌లకు యాంటి ఈవ్ టీజర్స్ స్క్వాడ్ పేరు సరిగా సరిపోతుందని ఉచిత సలహా ఇచ్చాడు.
వర్మ చేసిన ట్వీట్‌పై ఓ వ్యక్తి ఘాటుగా స్పందిస్తూ.. వర్మ లాంటి వాళ్లపై ట్విట్టర్ లో నిషేధం విధించాలని ట్వీట్ చేశాడు. అయితే, మళ్లీ స్పందించిన వర్మ.. తాను దుర్బలుడికి, రోమియో మధ్య సారూప్యాన్ని వివవరించానని చెప్పాడు. రోమియో సీరియస్ లవర్ అని, జులాయి కాదని వివరణ ఇచ్చాడు. ఒక వేళ తన ట్వీట్లు ఇష్టంలేకపోతే తనను అన్ ఫాలో కావాలని పేర్కొన్నాడు.
I am baffled with the name of Anti Romeo Squads...How can Romeo a revered lover be a synonym for a Eve teasing goon?
— Ram Gopal Varma (@RGVzoomin) 4 April 2017
The word Romeo is actually romanticising the wrong doers..A name like Anti Eve Teasers Squad would have been much more apt and pertinent
— Ram Gopal Varma (@RGVzoomin) 4 April 2017