: నా లాయ‌ర్ ఫీజును ప్ర‌జ‌లే చెల్లించాలి: కేజ్రీవాల్‌


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ తరపున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో, జెఠ్మలానీ పంపుతున్న ఫీజు బిల్లులు కేజ్రీకి తడిసి మోపెడవుతున్నాయి. ఏకంగా రూ. 3.42 కోట్ల బిల్లులు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. ఈ నేపథ్యంలో, ఈ బిల్స్ పై డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంతకం చేసి, ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వద్దకు పంపారు. దీనికి ఆమోదం తెలపాలా? వద్దా? అనే సంశయంలో అనిల్ బైజాల్ ఉన్నారు. దీనికి సంబంధించి నిపుణుల అభిప్రాయాన్ని ఆయన కోరారు. మరోవైపు, తన తరపున వాదిస్తున్న లాయర్ ఫీజులను ప్రజలే కట్టాలంటూ కేజ్రీవాల్ కొత్త వాదనను అందుకున్నారు. కేసు ఆయనదైతే... ఫీజులు మేము చెల్లించడం ఏందిరా బాబూ? అంటూ ఢిల్లీ వాసులు ఆశ్చర్యపోతున్నారు.   

  • Loading...

More Telugu News