: అఖిలప్రియ ముందు ఎన్నో సవాళ్లు!


ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న భూమా అఖిలప్రియ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం, అహోబిలం, యాగంటి, మహానంది, మంత్రాలయం, బెలూం గుహలు వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్న కర్నూలు జిల్లాలో టూరిజం మంత్రిగా ఆమె ఎన్నో పనులు పూర్తి చేయాల్సి వుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు నిధులను సమకూర్చి, ముందుకు సాగడం ఆమె ముందు ప్రధాన సమస్య కావచ్చని అంచనా వేస్తున్నారు.

టూరిజంకు ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 8 సర్క్యూటర్లను ఏర్పాటు చేయగా, వాటి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎకో టూరిజం, టూరిజం ఇన్ ఫ్రాస్టక్చర్ తదితరాలకు రూ. 70 కోట్ల విలువైన డీల్స్ కుదరగా, వాటి అమలు ఆగిపోయింది. అహోబిలం వద్ద రూ. 10 కోట్లతో రోప్ వే పెండింగ్ లో ఉంది. ఓర్వకల్లులో రాక్ గార్డెన్, బెలూం గుహల అభివృద్ధి, కొండారెడ్డి బురుజుకు లైటింగ్ సిస్టమ్ వంటి అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ఎకో టూరిజంలో భాగంగా చేపట్టిన పలు పనులు ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తి చేసేందుకు అఖిలప్రియ నడుం బిగించాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News