: మాతృత్వానికి కళంకం.. అప్పుడే పుట్టిన పసికందును నీళ్లలో ముంచి హత్య చేసిన యువతి!


పెళ్లికాకుండా గర్భం దాల్చిన ఓ యువతి దారుణానికి పాల్ప‌డింది. త‌న‌ పరువు పోతుందని భావించిన ఆ యువ‌తి త‌న‌కు బిడ్డ‌పుట్టిన వెంట‌నే బకెట్‌ నీళ్లలో ఆ శిశువుని ముంచి చంపేసింది. హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి అంజ‌య్య న‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. ఖమ్మం జిల్లా మణుగూరు సమితిసింగారానికి చెందిన ఆ యువతి(22) రెండు రోజుల కిందట గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని కాకతీయ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా చేరిందని చెప్పారు. గ‌ర్భంతో ఉన్న ఆమె ఆ విష‌యాన్ని దాచి పెట్టేందుకు ప‌లు విధాలుగా ప్ర‌య‌త్నించింద‌ని తెలిపారు. అయితే, రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 1.30 సమయంలో ఆసుపత్రి స్నానాల గదిలోకి వెళ్లిందని, అదే స‌మ‌యంలో ఆమె బాత్‌రూంలోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని చెప్పారు.

ఆ యువ‌తి నెలలు నిండకమునుపే ప్రసవించింద‌ని పోలీసులు తెలిపారు. బిడ్డ పుట్టిన వెంట‌నే ఆ శిశువుని బ‌కెట్ నీళ్ల‌లో ముంచేసింద‌ని చెప్పారు. అయితే, బాత్‌రూంలోంచి పసికందు ఏడుపు వినిపించడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న స్టాఫ్‌ నర్సుకి అనుమానం వ‌చ్చి అక్క‌డికి వెళ్ల‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింద‌ని చెప్పారు. లోపల గడియ పెట్టుకున్న ఆ యువ‌తి ఎంతకీ తలుపు తెరవలేద‌ని, చివ‌రికి ఆ న‌ర్సు గ‌ట్టిగా అర‌వ‌డంతో ఆ యువతి తలుపు తెరిచిందని పోలీసులు తెలిపారు. బకెట్‌లోని నీటిలో ప్రాణాలు కోల్పోయి ఉన్న శిశువుని గుర్తించిన ఆసుప‌త్రి సిబ్బంది ఈ విష‌యాన్ని త‌మకు తెలిపార‌ని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News