: అమెరికా ప్రథమ మహిళ మిలానియా అధికారిక ఫొటో ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఆ దేశ ప్రథమ మహిళ మిలానియా ట్రంప్ అధికారిక ఫొటోను వైట్ హౌస్ విడుదల చేసింది. శ్వేతసౌధంలోని ఓ కిటికీ ముందు ఈ ఫొటోను మిలానియా దిగారు. నలుపు రంగు జాకెట్ ధరించిన ఆమె... చేతులు కట్టుకుని కనిపించారు. ఫొటో విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రథమ మహిళగా దేశానికి సేవ చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. అమెరికా ప్రజల తరపున తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తానని తెలిపారు.
Official Portrait of First Lady pic.twitter.com/K1DUVE5kSI
— Melania Trump (@FLOTUS) April 3, 2017