: నాకున్న పేద క్లయింట్లలో కేజ్రీవాల్ కూడా ఒకరు... నాకేమిస్తాడులే!: రాంజఠ్మలానీ


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున పలు కేసుల్లో కోర్టు వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాంజఠ్మలానీ, ఆయన్నుంచి తాను ఎలాంటి ఫీజునూ వసూలు చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించినందుకు రూ. 3.42 కోట్ల బిల్ వేసిన ఆయన, "ఢిల్లీ ప్రభుత్వం ఈ ఫీజును చెల్లించకున్నా, కేజ్రీవాల్ ఇవ్వలేకపోయినా నేను వాదిస్తూనే ఉంటాను. కేజ్రీవాల్ ను నాకున్న పేద క్లయింట్లలో ఒకరిగా భావిస్తాను" అని చెప్పారు.

తాను ధనికుల నుంచి మాత్రమే ఫీజు వసూలు చేస్తుంటానని, పేదల తరఫున ఉచితంగానే వాదిస్తానని ఆయన అన్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, తన క్రాస్ ఎగ్జామినేషన్ ను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని చెప్పారు. కాగా, డిసెంబర్ 2016 నాటికి తన ఫీజుగా రూ. 1 కోటి, ఆపై ఒక్కోసారి కోర్టుకు వచ్చినందుకు రూ. 22 లక్షల చొప్పున రూ. 2.42 కోట్లు (11 సార్లు ఆయన కోర్టుకు వచ్చారు) మొత్తం కలిపి రూ. 3.42 కోట్లు ఇప్పించాలని కేజ్రీవాల్ కు రాంజఠ్మలానీ బిల్లును పంపారు.

  • Loading...

More Telugu News