: ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి!: ఆయేషా మీరా కేసుపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు


ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినందున... ఇన్నేళ్ల పాటు కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయక యువకులను కేసుల్లో ఇరికించి, జైలు పాలు చేస్తున్నారంటూ పోలీసు అధికారులపై ఆయన మండిపడ్డారు. కేసును విచారించిన పోలీసు అధికారుల తీరును హైకోర్టు తప్పుబట్టినప్పటికీ... ఒక్క రాజకీయ నాయకుడు కూడా దీనిపై ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి, వారి జీవితాన్ని నాశనం చేస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నప్పుడే... ఇలాంటి తప్పులు భవిష్యత్తులో పునరావృతం కావని ఆయన అన్నారు. సత్యంబాబు విషయంలో, దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News