: దూడను కాపాడబోయి ప్రాణం కోల్పోయింది
దూడను కాపాడబోయి ప్రాణాలను కోల్పోయింది ఓ మహిళ. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, అంకమ్మ (30) అనే మహిళ పశువులను తోలుకొని పొలాల్లోకి వెళ్లింది. ఈ సందర్భంగా, నీళ్లు తాగేందుకు ఓ దూడ బావి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో అది బావిలోకి పడబోయింది. దీంతో, దాన్ని కాపాడేందుకు పరుగున వెళ్లిన అంకమ్మ... దూడను లాగే ప్రయత్నం చేస్తూ, అదుపు తప్పి తాను బావిలో పడిపోయింది. వెనువెంటనే దూడ కూడా ఆమెపై పడింది. దీంతో, ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.