: బాహుబలి-2ను ఎట్టి పరిస్థితుల్లోను ఆడనివ్వం!: కన్నడ రక్షణ వేదిక


ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాహుబలి-2 సినిమాకు కర్ణాటకలో కష్టాలు తప్పేట్టు లేవు. ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు హెచ్చరించారు. బెంగళూరులో ఈ సంఘం కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జయన్న మాట్టాడుతూ, బాహుబలిలో కట్టప్ప పాత్రలో నటించిన తమిళ నటుడు సత్యరాజ్ గతంలో కావేరీ నీటి విషయంలో కన్నడ సంఘాల పట్ల చాలా చులకనగా మాట్లాడారని మండిపడ్డారు. కన్నడిగుల మనోభావాలు గాయపడేలా మాట్లాడిన సత్యరాజ్ నటించిన బాహుబలి-2 సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను ఆడనివ్వబోమని తెలిపారు. కావేరి నదీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News