: 35 ఏళ్లు శ్రమిస్తే ఇదేనా మీరిచ్చే బహుమానం?: బొజ్జల కుమారుడి విమర్శలు


తన తండ్రి మూడున్నర దశాబ్దాలుగా పార్టీ కోసం శ్రమిస్తే, కనీసం ఒక్కమాటైనా చెప్పకుండా, ఆరోగ్యం బాగాలేదని చెబుతూ తొలగించడం ఎంతో బాధను కలిగించిందని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి మంత్రి పదవులు కొత్తేమీ కాదని, తన తాతయ్య కూడా మంత్రేనని చెప్పారు. మంత్రిగా పనిచేయలేనప్పుడు ఎమ్మెల్యేగా మాత్రం ఎందుకని తన తండ్రి రాజీనామా చేయగా, ఆయనకు మద్దతుగా పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారని గుర్తు చేశారు. మిగతా మంత్రులతో పోలిస్తే, తన తండ్రి ఎక్కువ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ మొత్తం ఉదంతంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడం బాధాకరమని అన్నారు. రెండు రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై, తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నామని సుధీర్ తెలిపారు.

  • Loading...

More Telugu News