: చెప్పులు కుట్టే వ్యక్తికి ఐటీ నోటీసులు.. రూ.10 లక్షలకు లెక్కలు చెప్పాలని ఆదేశం
రోడ్డుపక్కన చెప్పులు కుట్టే వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ దిమ్మదిరిగే షాకిచ్చింది. నీ జన్‌ధన్ ఖాతాలో ఉన్న రూ.10 లక్షలకు లెక్కలు చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో అవాక్కయిన అతడు తన ఖాతాలో అంత డబ్బు ఉందా? అని ఆశ్చర్యపోయాడు. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన మన్షుక్ మక్వాన్ (55) రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుని జీవిస్తుంటాడు. ఐటీ నుంచి వచ్చిన నోటీసులను చూసి ఆయన అవాక్కయ్యాడు. తన జీవితంలో అంతపెద్దమొత్తంలో ఎప్పుడూ డబ్బు చూడలేదని పేర్కొన్నాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే తనకు వచ్చేది కేవలం రూ.200లని పేర్కొన్నాడు. అలాంటిది తన ఖాతాలో రూ.10 లక్షలు ఎలా ఉంటాయని ఆశ్చర్యపోయాడు.