: కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు.. అందుకే, చంద్రబాబును కలిశా: కాగిత వెంకట్రావు
తనకు మంత్రి పదవి రాకపోవడంతో కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారని, అందుకే, తమ అధినేత చంద్రబాబును కలిశానని టీడీపీ నేత కాగిత వెంకట్రావు అన్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో సీఎం చంద్రబాబును ఈ రోజు కలిశానని అన్నారు. కొన్ని కారణలతో తనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయానని చంద్రబాబు చెప్పారని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కాగిత వెంకట్రావు తెలిపారు.