: పదవి రావడం సులభం.. నిలబెట్టుకోవడం చాలా కష్టం: మంత్రి యనమల


పదవి రావడం సులభమని, ఆ పదవిని నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టమని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధిష్ఠానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని, భవిష్యత్ లో ఏ పార్టీకీ అవకాశమివ్వకుండా, టీడీపీ కార్యకర్తలు ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.  కాగా, మంత్రి వర్గ విస్తరణలో తమకు పదవులు దక్కలేదని పలువురు నేతలు ఆవేదన చెందుతున్న నేపథ్యంలో యనమల పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

  • Loading...

More Telugu News