: ‘తెలంగాణలో చేయాల్సింది చాలా ఉంది బ్రదర్..’ అంటూ ఏపీ యువకుడికి రిప్లై ఇచ్చిన కేటీఆర్!
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఏపీకి చెందిన ఓ యువకుడు ఓ ట్వీట్ చేశాడు. ఆంధ్రాలోని రాజకీయ పార్టీలతో తాము విసిగిపోయామని, ఏపీలో టీఆర్ఎస్ శాఖను ప్రారంభించాలని, అందు కోసం, ఎదురు చూస్తున్నామని ఆ ట్వీట్ లో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన కెల్లా శివకుమార్ కోరాడు. దీనికి స్పందించిన కేటీఆర్ ‘తెలంగాణ లో చేయాల్సింది చాలా ఉంది బ్రదర్. మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.
We have more than enough to do in Telangana brother. Thanks for the kind comments though https://t.co/t6YBME1duc
— KTR (@KTRTRS) April 3, 2017