: హైదరాబాదును పలకరించిన చిరుజల్లు
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఎండలు బెంబేలెత్తిస్తున్న సమయంలో హైదరాబాదును చిరుజల్లు పలకరించింది. హైదరాబాదులోని పలు ప్రాతాల్లో చిన్నపాటి తుంపర్లు పడ్డాయి. పగలంతా ఎండలు మండిపోవడంతో నగరవాసులు ఈ చిరు జల్లుకు కాస్త ఆహ్లాదంగా భావించినప్పటికీ ఈ తుంపర్లు భూమిని తడిపి అందులోంచి సెగలు పుట్టించాయి. దీంతో సాయంత్రం కూడా వేడిమి తగ్గలేదు.