: ఏసీబీ చరిత్రలోనే ఇది అతి పెద్ద కేసు.. చీఫ్ ఇంజనీర్ గంగాధరం అవినీతి లీలలు!


ఏపీ ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం కేసు ఏసీబీ చరిత్రలోనే పెద్ద కేసని ఏసీబీ అధికారులు తెలిపారు. వంద కోట్లకు పైగా ఆస్తులు సీజ్ చేశామని అన్నారు. దీనిపై హైదరాబాదులో ఏసీబీ అధికారులు మాట్లాడుతూ, ఈ కేసు ప్రత్యేకమైన కేసని అన్నారు. ఒక ప్రభుత్వోద్యోగి షెల్ కంపెనీలలో భాగస్వామి కావడం ఇదే తొలిసారని చెప్పారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు. ఆయన శాలరీ అకౌంట్ లో 21 లక్షల రూపాయలు గుర్తించామని చెప్పారు.

ఇంకా ఐమ్యాజిక్స్ మొలాసిస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలో 24 లక్షల రూపాయలు, ఇతర కుటుంబ సభ్యుల ఖాతాల్లో 6 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పారు. ఇలా కేవలం నగదు 50 లక్షల రూపాయలు సీజ్ చేశామని చెప్పారు. అతని లాకర్లలో పెద్దఎత్తున డాక్యుమెంట్లు లభించాయని, వాటిని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. షెల్ కంపెనీల్లో ఆయన పెట్టుబడి పెట్టినట్టు అర్థమవుతోందని, వాటన్నింటినీ చూడాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News