: ఆ దేశాల్లోని పిల్లలే విపరీతంగా ఏడుస్తారట!
పసిపిల్లలు పెట్టే ఏడుపు తల్లిదండ్రులను కొద్దిపాటి చికాకుకి గురిచేస్తుందన్న విషయం తెలిసిందే. వారిని లాలించి, ఏడుపును మానిపించడానికి తల్లిదండ్రులు కాస్త శ్రమపడాల్సి వస్తుంది. అయితే, పిల్లలు పుట్టిన 12 వారాల వరకు ఏ దేశంలో ఎక్కువగా ఏడుస్తారన్న అంశంపై బ్రిటన్‌కు చెందిన వార్‌విక్ వర్సిటీ పరిశోధన జరిపింది. ఆ పరిశోధన ఫలితంగా బ్రిటన్, కెనడా, ఇటలీ దేశాల్లో పసివారు అధికంగా ఏడుస్తారని తెలిసింది. ఇక డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పసిపిల్లలు అతి తక్కువగా ఏడుస్తారని వార్‌విక్ వర్సిటీ పరిశోధకులు తమ నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆయా దేశాల్లో చిన్నారులు ఏడ్చి తమ తల్లిదండ్రులను చికాకు పెట్టడం లేదని పరిశోధకులు తెలిపారు. అన్ని దేశాల్లోకెల్లా బ్రిటన్‌లోని చిన్నారులు మాత్రం అత్యధికంగా ఏడుపులంకించుకుంటున్నారు. అక్కడి పసివారు మొదటి రెండు వారాల పాటు రోజుకు మూడు గంటలు ఏడుస్తారని నివేదికలో తెలిపారు.