: అట్టహాసంగా రెజ్లర్ సాక్షి మాలిక్ వివాహం


రియో ఒలింపిక్స్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్, తోటి రెజ్లర్ సత్యవ్రత్ ల వివాహం అట్టహాసంగా జరిగింది. రోహ్ తక్ లో నిన్న జరిగిన ఈ వివాహానికి ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, రెజ్లింగ్ క్రీడ ద్వారానే సాక్షి మాలిక్, సత్యవ్రత్ ల మధ్య ఏర్పడ్డ పరిచయం క్రమంగా ప్రేమకు దారితీసింది. 2010 యూత్ ఒలింపిక్స్ లో సత్యవ్రత్ కు కాంస్యపతకం దక్కింది. అంతకు ముందు, వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్ పతకాన్ని సత్యవ్రత్ దక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News