: బాబుపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచినా వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. మంత్రి వర్గ విస్తరణలో స్థానం పొందిన నలుగురు అధికారికంగా ఇంకా తమ పార్టీలోనే ఉన్నారని ఆయన గవర్నర్ కు గుర్తుచేశారు. ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావులు ఇంకా తమ పార్టీని వీడలేదని తెలిపారు. ఈ నలుగురికి స్థానం కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని ఆయన మండిపడ్డారు.