: ఉత్తమమైన జట్టును చంద్రబాబు ఎంపిక చేశారు: తమిళ నటుడు మాధవన్
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం ఇవ్వలేదంటూ అధికార పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా నేతలు అలకబూని తమ పదవులకు రాజీనామాలు చేయడం తెలిసిందే. తాజాగా, ఏపీ రాజకీయాలతో సంబంధం లేని తమిళ సినీ నటుడు మాధవన్ స్పందించారు. ఏపీలో మంత్రి వర్గ విస్తరణపై ఆయన మాట్లాడుతూ, ఉత్తమమైన జట్టును సీఎం చంద్రబాబు ఎంపిక చేశారని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన జట్టులా ఇది ఉందని మాధవన్ అభిప్రాయపడ్డాడు.