: తన పసికందుని తీసుకుని ఎస్ఐ ట్రైనింగ్ కు వెళ్లిన మహిళ.. విజయవంతంగా శిక్షణ పూర్తి
గాంధీనగర్‌లోని గుజరాత్ పోలీసు అకాడమీలో మిట్టల్ పటేల్ అనే ఓ మహిళ తన 18 రోజుల పసికందుతో కలిసి ఎస్‌ఐ ట్రైనింగ్‌కు వెళ్లి, ప్రస్తుతం శిక్షణను పూర్తి చేసుకొని ఉత్తమ ట్రైనీగా డైరెక్టర్ ట్రోఫీ అవార్డును అందుకుంది. లక్ష్యం సాధించాలన్న పట్టుదల ఉంటే ఎటువంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని నిరూపించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. తన చిన్నారిని అకాడమీలోనే పెంచుతూ మరోవైపు శిక్షణలో పాల్గొంటూ చివరికి విజయవంతంగా శిక్షణను పూర్తి చేసింది. ఆ అకాడమీలో మొత్తం 421 మంది ఎస్‌ఐలు ఈ రోజు శిక్షణను పూర్తి చేసుకున్నారు. 421 మందిలో ఆమె 36వ ర్యాంకు కూడా సాధించింది. ఈ శిక్షణలో మొత్తం 270 మంది పురుషులు, 151 మంది మహిళలు పాల్గొన్నారు. మిట్టల్ పటేల్ కు ట్రైనింగ్‌లో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు.