: దేశ ద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైగో అరెస్టు
దేశద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైగోను పోలీసులు అరెస్టు చేశారు. 2009లో దేశ సమైక్యతకు వ్యతిరేకంగా ఆయన పలు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు చెన్నైలోని ఓ న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.