: సీఎం అయిన తరువాత రామమందిరంపై తొలిసారి స్పందించిన యోగి ఆదిత్యనాథ్


ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అయోధ్య రామమందిరంపై యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా స్పందించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సలహాను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ సమస్య కేవలం చర్చల ద్వారానే పరిష్కారమవుతుందని తాను నమ్ముతున్నట్టు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక 'పాంచజన్య'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.

గతంలో మఠాధిపతిగా, ఎంపీగా ఉన్న సమయంలో రామమందిరంపై యోగి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాత్రం తాను సంయమనం పాటిస్తున్నానన్న సంకేతాలు పంపుతూ, హిందూ, ముస్లిం పెద్దల చర్చలకు ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆహారం విషయంలో ఎవరి ఇష్టం వారిదే అయినప్పటికీ, గ్రీన్ ట్రైబ్యునల్, హైకోర్టు మార్గదర్శకాల ఆధారంగా అక్రమ కబేళాలపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News