: లోకేష్ కు పంచాయితీ రాజ్, ఐటీ... అఖిలప్రియకు స్త్రీ శిశు సంక్షేమం, యువజన సర్వీసులు!
భూమా శోభా నాగిరెడ్డి మరణం తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి, ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, నిన్న మంత్రి పదవిని చేపట్టిన యువ మహిళా నేత భూమా అఖిలప్రియకు స్త్రీ శిశు సంక్షేమం, యువజన సర్వీసులు, క్రీడా శాఖలను కేటాయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, నారా లోకేష్ కు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది. మిగతా వారి శాఖల కేటాయింపులపైనా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.