: హైదరాబాద్ లో హోటళ‍్లపై దాడులు... అపరిశుభ్రమైన మాంసం ఉపయోగిస్తున‍్న హోటళ‍్లపై చర‍్యలు


హైద‌రాబాద్‌లో నాసిరకం భోజనం పెడుతూ ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌పై జీహెచ్ఎంసీ కొర‌డా ఝళిపించింది. ఈ రోజు న‌గ‌రంలోని హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌పై ప్రజారోగ‍్యశాఖ అధికారులు ఆక‌స్మిక దాడులు నిర్వ‌హించి, అపరిశుభ్రత, మాంసం ఉపయోగిస్తున‍్న హోటళ‍్లపై చర‍్యలు తీసుకున‍్నారు. అందులో భాగంగా న‌గ‌రంలోని శాపూర్‌నగర్‌లో సాగర్‌ రెస్టారెంట్‌ను అధికారులు మూసివేశారు. అలాగే మ‌ల‌క్‌పేట ద‌గ్గ‌ర‌లోని నల్గొండ క్రాస్ రోడ్ లో ఉన్న‌ సోహైల్ హోటల్ కు అధికారులు రూ.40 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ దాడులు ఇంకా కొన‌సాగుతున్నాయి.


  • Loading...

More Telugu News