: బీచ్‌లోకి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చూసేందుకు భారీగా తరలివస్తోన్న ప్రజలు!
బీచ్‌లోకి ఓ భారీ తిమింగలం కొట్టుకొచ్చిన దృశ్యం ఒడిశాలోని పూరి తీరంలో కనిపించింది. ఈ రోజు ఉదయం 32 అడుగుల పొడవుగల తిమింగలాన్ని అక్కడి వారు గమనించారు. పూరిబీచ్లోని పంతావాన్ ప్రాంతానికి ఇది కొట్టుకొచ్చింది. దీనిని చూడడానికి ఆ ప్రాంతానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. పూరిబీచ్కి ప్రతిరోజు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారన్న విషయం తెలిసిందే.