: లాలూ తనయుడి సారథ్యంలో... ఆరెస్సెస్ కు పోటీగా డీఎస్సెస్ ఏర్పాటు!


బీజేపీకి వెన్నెముక అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆరెస్సెస్) కు పోటీగా ధర్మనిరుపేక్ష సేవక్ సంఘ్ (డీఎస్సెస్) ఏర్పాటయింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆరెస్సెస్ చేస్తున్న అరాచకాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు తేజ్ ప్రతాప్ తెలిపారు. సెక్యులర్ దేశమైన భారత్ లో మతోన్మాదాన్ని ఆరెస్సెస్ పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు. ఈ మతోన్మాదాన్ని డీఎస్సెస్ అడ్డుకుంటుందని చెప్పారు. అన్ని మతాల మధ్య శాంతి, స్నేహం పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News