: వైసీపీ నుంచి వచ్చిన వారితో రాజీనామా చేయిస్తే, నేనూ చేస్తా!: చంద్రబాబుకు తలసాని సవాల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే... తెలంగాణలో తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాయతీ, నిప్పులాంటి పదాలను చంద్రబాబు ఇక వాడకపోవడమే మంచిదని ఎద్దేవా చేశారు. గతంలో గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టారని... పార్టీలు మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వొద్దంటూ కాళ్లు అరిగేలా ఢిల్లీలో తిరిగారని... ఇప్పుడు అదే పనిని ఆయన కూడా చేశారని విమర్శించారు.