: పదవి నుంచి తప్పుకోమని చంద్రబాబే చెప్పారు: బొజ్జల


తుదిశ్వాస విడిచేంత వరకు తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలని అనుకున్నానని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. అయితే, అనారోగ్య కారణాల వల్ల తనను మంత్రి పదవి నుంచి తప్పుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని ఆయన తెలిపారు. పార్టీ కన్నా తన ఆరోగ్యమే ముఖ్యమని బాబు చెప్పారని అన్నారు. మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి ఇష్టం అని... అందులో వేరొకరి ప్రమేయం ఉండదని చెప్పారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. వారసుడైనంత మాత్రాన తన కుమారుడికి కిరీటం పెట్టరని... నాయకుడు ప్రజల్లో నుంచే రావాలని బొజ్జల అన్నారు. 

  • Loading...

More Telugu News