: దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ ను పెళ్లి చేసుకున్న హీరోయిన్ గౌతమి నాయర్‌


ఎంతో కాలంగా దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్‌తో ప్రేమలో ఉన్న మ‌లయాళ హీరోయిన్ గౌతమి నాయర్ ఆయనను పెళ్లి చేసుకుంది. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో గౌత‌మీ నాయ‌ర్ త‌న పెళ్లి ఎప్పుడ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెబుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో తన పెళ్లి విషయం చెబుతానని చెప్పింది. ఆమె చెప్పిన‌ట్లే శ్రీనాథ్ రాజేంద్రన్‌తో ఆమె వివాహం జ‌రిగింది. గౌతమి మొట్టమొదట 'సెకండ్ షో' అనే సినిమాలో న‌టించింది. ఆ చిత్రానికి రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. అనంత‌రం ఆమె నటించిన 'డైమండ్ నక్లెస్' సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. త‌న‌కు మంచి పాత్రలు ఏమైనా దొరికితే తాను సినిమాలు చేస్తానని గౌత‌మి చెబుతోంది.

  • Loading...

More Telugu News