: ఏపీ ఆర్అండ్‌బీ చీఫ్ గంగాధరానికి చెందిన లాకర్లను తెరవనున్న ఏసీబీ.. బినామీ ఆస్తులపై కూడా దృష్టి
ఆంధ్రప్రదేశ్ ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు జరిపిన ఏసీబీ అధికారులకు భారీ ఎత్తున ఆస్తులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ రోజు హైదరాబాద్‌లో ఆయనకు సంబంధించిన ఐదు లాకర్లు, విశాఖపట్నంలో రెండు లాకర్లను తెరవనున్నారు. అలాగే విజయవాడలోని ఆయన కార్యాలయంతోపాటు, ఇంట్లోనూ సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఆయన బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, కడప, బెంగుళూరుల్లోనూ ఆయనకు భారీగా ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆయనకు చెందిన సుమారు రూ.100 కోట్లకు పైగా సంపాదనను ఏసీబీ గుర్తించిన విషయం తెలిసిందే. గంగాధరం ప్రస్తుతం 13 రోజుల రిమాండులో ఉన్నాడు.