: మహిళా కార్యకర్తతో చెప్పు దెబ్బలు తిన్న ఆప్ నేత సంజయ్ సింగ్


ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ను రాజౌరీ గార్డెన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ వాలంటీర్ గా పని చేస్తున్న సిమ్రాన్ బేడీ చెప్పుతో కొట్టిన ఘటన కలకలం రేపింది. పార్టీ ఎన్నికల టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగిన విషయాన్ని తాను లేవనెత్తుతుంటే, అడ్డుకున్నారని ఆరోపిస్తూ, ఆమె ఈ దాడికి దిగింది. తాను పలుమార్లు ఈ విషయాన్ని పార్టీ వేదికలపై చెప్పేందుకు సిద్ధపడ్డా, సంజయ్ తనను అడ్డుకున్నాడని, అందుకే ఆగ్రహం పట్టలేక ఇలా చేశానని తెలిపారు.

కాగా, ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ యూనిట్ కన్వీనర్ దిలీప్ పాండే స్పందిస్తూ, మహిళా కార్యకర్త ప్రవర్తన సిగ్గుచేటని అన్నారు. సంజయ్ సింగ్ పై మహిళ దాడి చేసిన విషయంలో తిలక్ నగర్ ఎంఎల్ఏ జర్నాలీ సింగ్ నుంచి తమకు సమాచారం అందిందని, సంజయ్ సింగ్ నుంచి మాత్రం ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంచితే, త్వరలో జరగనున్న ఎంసీడీ ఎన్నికల్లో ఆమె టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News