: శ్రుతి మించిన చేష్టలతో బాధ కలిగింది... ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటానా?: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం


తెలుగుదేశం పార్టీ నియమావళిని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, ఇష్టానుసారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనందరి లక్ష్యం 2019 ఎన్నికలేనని, రెండేళ్ల తరువాత గెలుపే లక్ష్యంగా, సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యం పాటిస్తూ విస్తరణ జరిగిందని, ఎవరికి పదవులు ఇచ్చినా విస్తృతంగా చర్చించే నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. నిన్న కొందరు శ్రుతి మించి ప్రవర్తించడం తనకు బాధను కలిగించిందని ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే తనతో నేరుగా చెప్పాలే తప్ప, మీడియాకు ఎక్కితే చూస్తూ ఊరుకోబోనని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని, పార్టీకి మంచి పేరు తేవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News