: నెలకు రూ. 249తో రోజుకు 10 జీబీ... భారత టెలికం రంగంలో అత్యంత చౌక ఆఫర్!


ఇండియన్ టెలికం ఇండస్ట్రీలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ అత్యంత చౌక డేటా ప్లాన్ ను ప్రకటించింది. 'ఎక్స్ పీరియన్స్ అన్ లిమిటెడ్ బీబీ 249' పేరిట ప్రకటించిన ఈ బ్రాడ్ బ్యాండ్ (వైర్ లైన్) పథకంలో నెలకు రూ. 249 చెల్లిస్తే, నెల రోజుల పాటు రోజుకు 10 గిగాబైట్ల డేటాను వాడుకోవచ్చని తెలిపింది. ఇక ఈ పథకంలో ఏ నెట్ వర్క్ కైనా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, ఆదివారం నాడు రోజంతా ఉచిత కాల్స్ ఆఫర్ ఉంటుందని తెలిపింది. డేటా 2 మెగాబైట్ల వేగంతో ఉంటుందని పేర్కొంది. కాగా, దేశంలో ఇంత తక్కువ ధరకు ఇంత ఎక్కువ డేటాను ప్రకటించిన సంస్థ బీఎస్ఎన్ఎల్ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News