: దలైలామా గొప్పతనం.. 60 ఏళ్ల క్రితం తనను రక్షించిన వ్యక్తిని కలిసి సత్కరించిన వైనం!
దాదాపు ఆరు దశాబ్దాల క్రితం తనను రహస్యంగా చైనా ఆక్రమిత టిబెట్ నుంచి భారత్‌కు తరలించిన సైనిక బృందం సభ్యుడిని వెతికి మరీ సత్కరించారు బౌద్ధగురువు దలైలామా. కోట్లాదిమందికి ప్రత్యక్ష దైవం అయిన ఆయన ఆదివారం అస్సాంలోని గువాహటి వచ్చారు. అస్సాం రైఫిల్స్ మాజీ జవాను నరేన్ చంద్రదాస్‌ను కలిసి ఆలింగనం చేసుకున్నారు. శాలువాతో సత్కరించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1959లో దలైలామాను టిబెట్ నుంచి భారత్‌కు తరలించిన సైనిక బృందంలో చంద్రదాస్ సభ్యుడు. ఐదుగురు సభ్యులతో కూడిన రహస్య ఆపరేషన్‌లో చంద్రదాస్ జాడ మాత్రమే దొరికింది. దీంతో ఆయనను కలుసుకున్న దలైలామా కృతజ్ఞతలు తెలిపారు.