: అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు నన్ను పడకగదికి రమ్మన్నారు.. మలయాళ నటి పార్వతి సంచలన వ్యాఖ్యలు


సినిమాల్లో అవకాశాల పేరుతో పలువురు హీరోలు, దర్శకులు తనను పడకగదికి రమ్మన్నారని కోలీవుడ్ నటి, మలయాళీ భామ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పై వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని, పడకగదికి రమ్మనే చేదు అనుభవాన్ని తానూ ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు పలుమార్లు తనను బెడ్రూంకు రమ్మన్నారని తెలిపింది.

అయితే ఇక్కడ ఇదంతా మామూలేనని చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారని కూడా పేర్కొంది. తాను తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఇదేనని, అలాంటి అవకాశాలు తనకు వద్దని తేల్చి చెప్పింది. ఈ కారణంగానే తాను చాలాకాలం ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని చెప్పుకొచ్చింది. ‘పూ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన పార్వతి చేసింది తక్కువ సినిమాలే అయినా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా, తమకూ ఇటువంటి చేదు అనుభవాలు ఎదురైనట్టు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, సంధ్య, కస్తూరి తదితర హీరోయిన్లు బహిరంగంగానే వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News