: యూపీని మరో పాకిస్థాన్ కాకుండా యోగి కాపాడారు.. సాధ్వి ప్రాచి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టి మంచి పని చేశారని, రాష్ట్రం మరో పాకిస్థాన్ కాకుండా కాపాడారని వివాదాస్పద హిందూత్వ నేత సాధ్వి ప్రాచి అన్నారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి ప్రజల్లో సంతోషం నింపడమే కాదు.. యూపీని మరో పాకిస్థాన్ కాకుండా కాపాడారు’’ అని సాధ్వి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన పలు పనులపై దర్యాప్తు చేపడతామని, వారి బండారం త్వరలోనే బయటపడుతుందని అన్నారు. బహుశా ఇది వారికి (సమాజ్‌వాదీ పార్టీ)కి నిద్రలేని రాత్రులను ఇస్తుందని పేర్కొన్నారు. యూపీలోనూ మద్య నిషేధం విధించాలని ఓ ప్రశ్నకు సమాధానంగా సాధ్వి పేర్కొన్నారు.