: సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. సిలిండర్‌పై రూ.5.57 భారం
వంటగ్యాస్ ధరలు పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రాయితీ కలిగిన 14.2 కిలోల సిలిండర్‌పై రూ.5.57 పెంచగా నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.14.50 తగ్గించాయి. ధర పెరగడంతో 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ.440.50కు చేరుకుంది. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర తగ్గడంతో రూ.737.50 నుంచి రూ.723కు చేరుకుంది. కాగా మార్చి 1న ఇదే సిలిండర్‌పై రూ.86 పెరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇంధన ధరలు తగ్గించిన రెండు రోజులకే సబ్సిడీ సిలిండర్ ధర పెంచడం గమనార్హం.