: పవన్ కల్యాణ్ లాంటి వారిని బతిమలాడాల్సిన అవసరం లేదు: ముద్రగడ పద్మనాభం


కాపు ఉద్యమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ రోజూ సహకరించలేదని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కాపు ఉద్యమానికి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ లాంటి వారిని బతిమలాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. కాపు ఉద్యమానికి మద్దతు తెలపాలని పవన్ కల్యాణ్ కు గతంలో ఆహ్వానం పంపినా స్పందించలేదని, కొంతమంది రానంత మాత్రాన తమ ఉద్యమం ఆగిపోదని, బొట్టు పెట్టి మరీ పిలిచేందుకు, ఇది ఎవరి ఇంట్లోనో జరుగుతున్న పెళ్లి కాదని ముద్రగడ విమర్శించారు.

  • Loading...

More Telugu News