: మంత్రి పదవి ఇవ్వకపోయేసరికి కాపులు గుర్తుకు వచ్చారా?: బోండా ఉమకు ముద్రగడ సూటిప్రశ్న


మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఎమ్మెల్యే బోండా ఉమపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పీసీసీ కార్యదర్శి గోవిందు శంకర శ్రీనివాసన్ కుమార్తె వివాహం ఈ రోజు జరిగింది. ఈ వివాహా కార్యక్రమానికి ముద్రగడ హాజరయ్యారు. అంతకుముందు, ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బోండా ఉమకు మంత్రి పదవి దక్కకపోయేసరికి, ఆయనకు ఇప్పుడు కాపులు గుర్తొచ్చారా? అంటూ ప్రశ్నించారు. బోండా ఉమ లాంటి వ్యక్తులతో తమను నిత్యం తిట్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ కుట్ర రాజకీయాలను కాపు ప్రజా ప్రతినిధులంతా గమనించాలని అన్నారు.

తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసారీ, వైఎస్సార్సీపీ అధినేత జగన్ తో తమకు రాజకీయ సంబంధాలు అంటగడుతున్నారని, పలు ఆరోపణలు చేస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. వైఎస్ జగన్ తో తమకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న చంద్రబాబుకు దీనిని నిరూపించమని సవాల్ విసురుతున్నానని అన్నారు. నిరూపించలేని పక్షంలో చంద్రబాబు తన సీఎం పదవికి రాజీనామా చేయలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News