: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ పీవీ సింధు కైవసం


ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీని పి.వి.సింధు కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తో తలపడ్డ సింధు ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.  రెండు వరుస సెట్లలో మారిన్ ను 21-19, 21-16 తేడాతో సింధు విజయం సాధించింది. కాగా, తొలి గేమ్ లో సింధు తొలుత మారిన్ పై ఆధిపత్యం కనబరిచింది. తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో నువ్వా? నేనా? అన్నట్లు వారు తలపడ్డారు. చివర్లో సింధు తన అద్భుత ఆటతీరుతో మొదటి గేమ్ ను 21-19 తేడాతో కైవసం చేసుకుంది. రెండో గేమ్ కూడా ఆసక్తికరంగా సాగింది. చివరకు 21-16 తేడాతో ముగించి సింధు పై చేయి సాధించింది. సింధు తన కెరీర్ లో రెండో సూపర్ సిరీస్ టైటిల్ ను దక్కించుకుంది. 

  • Loading...

More Telugu News