: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు: బొత్స సత్యనారాయణ
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అనైతిక పాలన సాగుతోందని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడాన్ని జాతీయ అంశంగా తీసుకు వెళ్తామని అన్నారు. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చినప్పుడు, చంద్రబాబు పదే పదే గవర్నర్ ను విమర్శించారని, ఇప్పుడేమో, వాళ్లిద్దరూ కలిసి అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్ జగన్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.