: నాకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారు: బోండా ఉమ


కాపు కులస్తులకు అన్యాయం జరగడం తొలిసారి కాదని, ఈ విధంగా జరుగుతుండటం తమకు మామూలైపోయిందని మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అనంతరం ఉమ మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్యనేత అడ్డుకున్నారని  ఆరోపించారు. దీంతో, ఫలితాలు రావాల్సిన సమయంలో రాలేదని, రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్టు జరగవని అన్నారు. సీఎం చంద్రబాబు తనకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు  సమాధానంగా చెప్పారు.

  • Loading...

More Telugu News