: లోకేష్ కోసమే మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు: సీపీఎం నేత రాఘవులు
నారా లోకేష్ కోసమే ఏపీ మంత్రి వర్గ విస్తరణ చేపట్టారని సీపీఎం నేత బి.వి. రాఘవులు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు అన్యాయం అంటూ ఆనాడు విమర్శించిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు ఏపీలో చేసింది న్యాయమా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి వర్గ విస్తరణలో పెద్దపీట వేశారని, మంత్రి పదవులు పోయినవారు అసమర్థులా? లేక కొత్తగా మంత్రిగా పదవులు చేపట్టిన వారు సమర్థులా? అని రాఘవులు నిలదీశారు.