: ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే: వైఎస్ జగన్
తమ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించడంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేడు ఏపీ చరిత్రలో బ్లాక్ డే అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కేబినెట్ లోకి తీసుకోవడమనేది రాజ్యాంగానికి, రాష్ట్రానికి జరిగిన ఘోర అవమానమని అన్నారు.