: చదవలేక కాదు... మా నాన్న గుర్తొచ్చి తడబడ్డాను: భూమా అఖిలప్రియ


ఈ ఉదయం ఏపీ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ, మాటలు తడబడటంపై భూమా అఖిలప్రియ వివరణ ఇచ్చారు. ఆ సమయంలో తనకు తండ్రి భూమా నాగిరెడ్డి గుర్తుకు వచ్చారని, అందుకే నోట మాట రాలేదని చెప్పారు. కొంచెం ఎమోషనల్ అయ్యానని, అందుకే ప్రమాణం మధ్యలో ఆగానని అన్నారు. ఏ శాఖ ఇస్తారన్న ఆలోచన తనకు లేదని, ఏ బాధ్యతలు అప్పగించినా, నిర్వహిస్తానని అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్ర సమస్యలన్నీ తీర్చేందుకు కృషి చేస్తానని వివరించారు. కాగా, అఖిలకు విద్యా శాఖ ఇవ్వవచ్చని వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News