: అసంతృప్త నేతల్లో చేరిన ఎమ్మెల్యే చింతమనేని!


కాంగ్రెస్ నుంచి వచ్చిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాజీనామాకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో టీడీపీపై కేసులు పెట్టిన వ్యక్తికి ఇప్పుడు మంత్రి పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించిన ఆయన, ఈ చర్యతో జిల్లాలో తెలుగుదేశం నేతల పరువు పోయిందని తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించారు. ఇప్పటికే తన రాజీనామాపై కార్యకర్తలతో చింతమనేని చర్చలు సాగించినట్టు సమాచారం. మంత్రి వర్గ విస్తరణ తరువాత అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ ఉండటం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామమేనని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News