: నాలా తప్పులు చేయకుండా జైల్లో మగ్గుతున్న వారెందరో: సత్యంబాబు


ఎలాంటి తప్పులూ చేయకుండానే తనలాగే ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారని, వారందరినీ విడుదల చేయించేందుకు కృషి చేయాలని ఆయేషా హత్య కేసు నుంచి విముక్తుడై, నేడు బయటకు వచ్చిన సత్యం బాబు వ్యాఖ్యానించాడు. ఈ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట మీడియాతో మాట్లాడిన సత్యం బాబు, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. చేయని తప్పుకు తాను 9 సంవత్సరాలు జైల్లో గడపాల్సి వచ్చిందని, జైల్లోనే తాను డిగ్రీ విద్యను అభ్యసించానని చెప్పాడు. ఇంతకాలానికైనా న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించాడు. తన కుటుంబం దీన స్థితిలో ఉందని, చెల్లి పెళ్లి చేయాల్సి వుందని చెప్పాడు. కాగా, ఆయేషా హత్య కేసులో సత్యంబాబును నిర్దోషిగా హైకోర్టు నిర్దారించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News