: ప్రమాణం చేస్తూ తడబడ్డ అఖిలప్రియ!
ఏపీ మంత్రిగా కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేసిన భూమా అఖిలప్రియ, ప్రమాణం చేస్తున్న వేళ కొద్దిగా తడబడ్డారు. 'ప్రత్యక్షంగా' అన్న పదాన్ని పలకాల్సిన చోట ఆమె మూడు నాలుగు క్షణాలు ఆగాల్సి వచ్చింది. ఆ సమయంలో వెనకాల ఉన్న అధికారులు, ఆ పదాన్ని పలకడంతో ఆమె తన ప్రమాణాన్ని కొనసాగించారు. 'నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించేందుకు' అనాల్సిన చోట కూడా ఓ క్షణం తడబడ్డారు. అఖిలప్రియ ప్రమాణం చేస్తున్న సమయంలో అక్కడికి తరలివచ్చిన భూమా కుటుంబ అభిమానులు ఈలలు, చప్పట్లతో తమ హర్షధ్వానాలను వ్యక్తం చేశారు.