: మొదలైన ప్రమాణ స్వీకారం... తొలుత కిమిడి కళా వెంకట్రావు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కొత్తవారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వెలగపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై వైభవంగా ప్రారంభమైంది. మొట్టమొదట కిమిడి కళా వెంకట్రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీకాకుళం జిల్లా రేగడి గ్రామంలో జన్మించిన కళా వెంకట్రావు బీఏ విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఎచ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.